త్వరలో మార్కెట్లోకి తెలంగాణ మటన్

త్వరలో మార్కెట్లోకి తెలంగాణ మటన్
  • సర్కార్ ఔట్‌‌లెట్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ బ్రాండ్‌తో మాంసాన్ని ఔట్‌‌లెట్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు పశుసంవర్ధకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. యానిమల్‌‌ హజ్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌ టీమ్‌‌ ఇప్పటికే  దీనిపై పని చేస్తోంది. దీని కోసం ప్రత్యేక స్లాటర్‌‌ హౌస్‌, మీట్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇక్కడి గొర్రెల మాంసాన్ని ప్రాసెస్‌‌ చేసి ప్యాకింగ్‌‌ చేసి ప్రత్యేక ఔట్‌‌లెట్ల ద్వారా వినియోగ దారులకు అందించే అంశంపై స్టడీ చేస్తున్నారు. తెలంగాణ గొర్రెల మాంసం మంచి రుచిగా ఉంటుందనే అంశంపై ఈ రీసెర్చ్‌‌ టీమ్‌‌ వర్క్‌‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాండ్‌‌ మాంసం విక్రయాలను త్వరలో ప్రారంభిస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం మాసాబ్‌‌ట్యాంక్ లోని మంత్రి పేషీలో పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు, వెటర్నరీ డాక్టర్ల డైరీ, క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.

For More News..

ఏపీకి కోటాకు మించి నీళ్లియ్యలేం

పార్టీకి సోనియాగాంధీ విరాళం ​50 వేలే

లాటరీతోనే హెచ్ 1బీ వీసాలు