తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుపై రేపు ప్రకటన 

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుపై రేపు ప్రకటన 
  • ప్రభుత్వం, పరిపాలనకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం

కాబుల్: అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు రేపు తమ ప్రభుత్వ ఏర్పాటు, పరిపాలన వ్యవహారాలపై కీలక ప్రకటన చేసే చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజధాని కాబుల్ లోని అధ్యక్ష భవనంలో శుక్రవారం ప్రార్థనల అంతరం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ ధృవీకరించారు. అమెరికా దళాల నిష్క్రమణ పూర్తి కావడంతో దేశంలో పరిపాలన వ్యవహారాలపై దృష్టి సారించిన తాలిబన్లు గత ప్రభుత్వ హయాంలోని పలువురు కీలక అధికారులు, 
తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆఫ్గన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు ద్వారా పరిస్థితిని చక్కబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం కోసం గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతూ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏ ప్రభుత్వం వచ్చినా లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా సుప్రీం లీడర్ గా కొనసాగుతారు. రాజకీయ విభాగపు అగ్రనాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలో ప్రత్యేక పాలనా మండలి ఏర్పాటు జరగొచ్చని అంచనా. ఆఫ్ఘన్ ను ఆక్రమించినా ఇప్పటి వరకు బయటకు కనిపించని తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా, అబ్దుల్ ఘనీ బరాదర్ బహిరంగంగా కనిపించే అవకాశాలున్నట్లు సమచారం. అమెరికా దళాల నిష్క్రమణ తుదిదశకు చేరుకున్న తరుణంలో ఆగస్టు 15న తాలిబన్లు రాజధాని కాబుల్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచిపెట్టిపోవడంతో తాలిబన్లు ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా లేకుండా రాజధాని కాబుల్ ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాలిబన్లు అడుగుపెట్టిన నాటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి రెండు వారాలు గడచినా సద్దుమణగలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం తాలిబన్లు సంప్రదింపుల ప్రయత్నాలు చేస్తున్నారు.