అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు ఫ్లైట్లు నడపండి.. తాలిబాన్ల రిక్వెస్ట్

అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు ఫ్లైట్లు నడపండి.. తాలిబాన్ల రిక్వెస్ట్
  • అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు ఫ్లైట్లు నడపండి
  • ఇండియాను కోరిన తాలిబాన్లు

కాబూల్‌‌‌‌‌‌‌‌: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఫ్లైటు సర్వీసులు నడపాలని తాలిబాన్లు చేసిన విజ్ఞప్తిపై నిర్ణయాన్ని మనదేశం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. కాబూల్‌‌‌‌‌‌‌‌కు కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సివిల్ ఏవియేషన్‌‌‌‌‌‌‌‌(డీజీసీఏ), ఎక్స్‌‌‌‌‌‌‌‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కలిసి బుధవారం రివ్యూ చేశారు. ఫ్లైట్లు నడపాలా.. వద్దా అనే దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఆగస్టు 15 నుంచి రెండు దేశాల మధ్య కమర్షియల్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి. వాటిని తిరిగి స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని డీజీసీఏకి సివిల్‌‌‌‌‌‌‌‌ ఏవియేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబరు 6న లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసింది. ‘‘అమెరికా సైనికులు దేశం నుంచి వైదొలగుతున్న సమయంలో జరిగిన దాడిలో కాబూల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ధ్వంసమైంది. కతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నికల్ సపోర్టుతో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ రీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాం” అని ఈ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.