అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం

అమెరికాలో ఎతైన హనుమాన్ విగ్రహం

అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది అమెరికాలోనే ఎతైన హిందూ దేవుడి విగ్రహం. ఢెలావేర్ రాష్ట్రంలో 25 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. డెలావర్ లో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఇది రెండవది. మొదటిది న్యూ కాజిల్‌లోని హోలీ స్పిరిట్ చర్చిలో లేడీ క్వీన్ ఆఫ్ పీస్ విగ్రహం. దాని తరువాత తాజాగా ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం డెలావేర్ లోని రెండవ అతిపెద్ద మత విగ్రహం. ఈ విగ్రహం నల్ల గ్రానైట్ తో చెక్కబడింది. దీనిని చెక్కడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది.

‘విగ్రహాన్ని శిల్పకారుడు తయారు చేసి ఆలయానికి అందజేసిన తరువాత ఆలయ పూజారులు సాధారణంగా 5 నుండి 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. వాటిలో ఎక్కువగా అగ్నిహోమాలు ఉంటాయి. విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి యంత్ర ప్రతిష్ఠ మరియు ప్రాణ ప్రతిష్ఠలు చేస్తాం. కరోనావైరస్ విజృంభిస్తోన్న కారణంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వేడుకలలో ఎక్కువ మంది పాల్గొనరని’ అని హిందూ టెంపుల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటిబంద శర్మ తెలిపారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు