మాస్టర్‌‌‌‌ చెఫ్‌‌ హోస్ట్‌‌గా తమన్నా

మాస్టర్‌‌‌‌ చెఫ్‌‌ హోస్ట్‌‌గా తమన్నా

వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో ‘మాస్టర్‌‌‌‌చెఫ్‌‌’. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్‌‌‌‌హిట్టైంది. 2010లో మన దేశంలోకి ఎంటర్‌‌‌‌ అయిన ఈ షో హిందీలో మాత్రమే వచ్చింది. ఇప్పుడు తెలుగులో ‘మాస్టర్‌‌‌‌చెఫ్‌‌ తెలుగు’ పేరుతో ‘జెమినీ టీవీ’లో టెలికాస్ట్‌‌ అవుతుంది. దీనికి హోస్ట్‌‌ హీరోయిన్‌‌ తమన్నా భాటియా. టీవీ షో హోస్ట్‌‌గా తమన్నాకు ఇదే మొదటి ఎంట్రీ. ఇంతకుముందు నిర్వాహకులు ఈ షో కోసం విక్టరీ వెంకటేశ్‌‌, రానా దగ్గుబాటి, కాజల్‌‌ అగర్వాల్‌‌ పేర్లు పరిశీలించారు. చివరకు తమన్నాను సెలక్ట్‌‌ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌‌ స్టార్ట్‌‌ అవుతుంది. వివిధ ప్రాంతాలకు చెందిన చెఫ్స్‌‌ ఈ షోలో పాల్గొని ప్రత్యేక వంటలు చేస్తారు. అన్ని టాస్క్‌‌లు పర్ఫెక్ట్‌‌గా చేసిన వాళ్లు ‘మాస్టర్‌‌‌‌ చెఫ్‌‌ తెలుగు’ టైటిల్‌‌ గెలుచుకుంటారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ షో రెడీ చేస్తున్నారు. తమిళంలో విజయ్‌‌ సేతుపతి, మలయాళంలో పృథ్వీ సుకుమారన్‌‌, కన్నడలో ‘కిచ్చా’ సుదీప్‌‌ ఈ షోస్‌‌ హోస్ట్‌‌ చేసే ఛాన్స్‌‌ ఉంది. వచ్చే నెలలో ‘మాస్టర్‌‌‌‌చెఫ్‌‌ తెలుగు’ మొదలవ్వొచ్చు.