Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!

Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!

అరణ్మనై ఫ్రాంచైజీలో తాజాగా వస్తున్న మూవీ అరణ్మనై 4 (Aranmanai 4). హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో విడుదలకు సిద్దమయింది.

టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. 

అయితే తాజాగా ఈ మూవీని మే 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదల తేదీ వాయిదా వేస్తూ కొత్త తేదిని అనౌన్స్ చేశారు. 

ఇప్పటికే బాక్ సినిమా నుండి పంచుకో అంటూ సాగె పాటను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న తమన్నా, రాశీఖన్నా లపై ఈ కలర్‌ఫుల్‌ కిక్ ఇస్తుంది. ఇక ఈ పాటలో ఇద్దరు భామలు తమ అందాలతో ఆడియన్స్ కు కనువిందు చేశారు.

పొట్టి పొట్టి డ్రెస్సులతో పోటీపడుమరీ అందాలను ఆరబోశారు. గ్లామర్ తో రచ్చ చేశారు. దాంతో.. ఈ పాట చూసిన ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.   

అంతేకాదు వచ్చేవారం ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన దిల్ రాజు కుమారుడు ఆశిష్ రెడ్డి లవ్ మీ మూవీ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.