మెగా హీరో మూవీలో తమన్న పాట

మెగా హీరో మూవీలో తమన్న పాట

ఓవైపు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్‌‌‌‌‌‌‌‌తోనూ ఇంప్రెస్ చేస్తోంది తమన్నా. అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీయఫ్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో హీరోలతో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇప్పుడు మరోసారి స్పెషల్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్‌‌‌‌‌‌‌‌ కొర్రపాటి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ఓ ప్రత్యేక పాట చేయబోతోంది. తమన్‌‌‌‌‌‌‌‌ ట్యూన్ చేసిన ‘కొడ్తే’ అనే ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌ను సంక్రాంతి కానుకగా ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తళుకుల డ్రెస్‌‌‌‌‌‌‌‌ వేసుకుని గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వీన్‌‌‌‌‌‌‌‌లా కనిపిస్తోంది తమన్నా. ఆల్రెడీ ఆమె సాంగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కనుక ఈ పాటపై కూడా మంచి అంచనాలు ఏర్పడటం ఖాయమనిపిస్తోంది. ఇక తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌‌‌‌‌‌‌‌3, బోలె చూడియా చిత్రాలు రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతున్నాయి. భోళా శంకర్, ప్లాన్ ఎ ప్లాన్‌‌‌‌‌‌‌‌ బి మూవీస్‌‌‌‌‌‌‌‌ సెట్స్‌‌‌‌‌‌‌‌పై ఉన్నాయి.