
ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి ‘కావాలయ్యా..’ అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటతో తమన్నా(Tamannaah) మరోసారి ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు స్టెప్పులేసి చూపించండంటూ ఈ బ్యూటీ ఇటీవల ఫ్యాన్స్‌ను కోరింది. కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు.
ఈ పాటపై వీడియోలు క్రియేట్ చేయమని ఏఐని కోరారు. ఇందులో తమన్నాకు బదులుగా సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నుంచి కాజల్ అగర్వాల్ వరకు అందరితో డ్యాన్స్ చేయించారు. ఈ టెక్నాలజీ మాయాజాలం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇది నిజమేనా అంటూ కొందరు షాకవుతున్నారు. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదలకు రెడీ కానుంది.
Simran edition #Kaavaalaa @anirudhofficial @simranbaggaoffc @sunpictures @tamannaahspeaks #GenerativeAI #muonium pic.twitter.com/EHBCUaNZq9
— Senthil Nayagam (@senthilnayagam) July 11, 2023
ఇటీవల ఈ సాంగ్ విడుదలై 2 కోట్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియాల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ భావిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.