
నటి తమన్నా(Tamannaah) విజయ్ వర్మ(Vijay Varma) ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే తమన్నాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని విజయ్ వర్మను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది.
దీనిపై విజయ్ వర్మ సూటిగా స్పందించాడు. తమన్నాను తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని తన తల్లికే ఇంకా చెప్పలేదని, మీడియాకు ఎందుకు చెబుతానంటూ సమాధానమిచ్చారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయ్యారు. ఇటీవలె తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటించింది తమన్నా. దటీజ్ మహాలక్షి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ సుధ కొంగర(Sudha Kongara) డైరెక్షన్ లో కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్యతో తెరకెక్కుతున్న (సూర్య43) మూవీలో విజయ్ వర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు.