లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కమర్షియల్ హీరోయిన్‌‌‌‌గా కొనసాగుతూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది తమన్నా. రీసెంట్‌‌‌‌గా బాలీవుడ్‌‌‌‌లో ‘బబ్లీ బౌన్సర్’ మూవీ చేసింది. ఫ్యాషన్, పేజ్‌‌‌‌ త్రీ లాంటి చిత్రాలు తీసిన మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 23న డిస్నీప్లస్ హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. లేడీ పహిల్వాన్‌‌‌‌గా తమన్నా ఆకట్టుకుంది. బౌన్సర్ల గ్రామంగా చెప్పుకునే ఫతేపూర్‌‌‌‌‌‌‌‌ బేరికి చెందిన అమ్మాయి బబ్లీ. అబ్బాయిల కంటే స్ట్రాంగ్‌‌‌‌. ఎంత బరువైనా ఈజీగా ఎత్తేస్తుంది. ఎంతటి బలవంతులనైనా క్షణాల్లో చిత్తు చేసేస్తుంది. ఇలాంటి పిల్లకి పెళ్లెలా చేయాలా అని పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు. బబ్లీ మాత్రం పెళ్లి వద్దు, ఏదైనా పని చూసుకుంటా అని పట్నం చెక్కేస్తుంది. లేడీ బౌన్సర్‌‌‌‌‌‌‌‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. దాంతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ. పల్లెటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని, బౌన్సర్‌‌‌‌‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌నెస్‌‌‌‌ని ఒకేసారి ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేస్తోంది తమన్నా. యాక్షన్‌‌‌‌తో పాటు కామెడీ కూడా అదరగొట్టిందనిపిస్తోంది. అవకాశాలు ఎక్కువే ఉన్నా విజయాలు అంతంతమాత్రంగా ఉన్న ఆమెకి.. ఈ సినిమాతో హిట్టు దక్కుతుందేమో చూడాలి మరి!