రోడ్డు ప్రమాదంలో నటుడు మనో దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నటుడు మనో దుర్మరణం

పుగళ్ సినిమాతో పాపులర్ అయిన  తమిళ నటుడు మనో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు తన భార్యతో కలిసి కారులో వెళుతుండగా  చెన్నై సెంటర్ మీడియం అనే ప్రాంతంలో మనో కారు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మనో అక్కడికక్కడే  మృతి చెందగా.. అతని భార్యని రామచంద్ర  ఆస్పత్రిలో చావు బత్రుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.

మనో మృతి చెందడంతో అతని కుటుంసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  మిమిక్రి ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్ గా, యాంకర్ గా, నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్న మనో మరణించారనే వార్త తెలియడం తమిళ నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.