మాజీ మంత్రి నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు

V6 Velugu Posted on May 30, 2021

  • మాజీ మంత్రి మణికందన్ పై తమిళ హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు
  • భార్య సరిగా చూసుకోవడంలేదని నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు
  •  నాతో ఐదేళ్లు సహజీవనం చేసి మోసం చేశాడు
  • మూడుసార్లు బలవంతంగా గర్భం తీయించాడు: హీరోయిన్ చాందిని

చెన్నై: తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు శశికళ రీ ఎంట్రీకి సన్నాహాలు చేసుకుంటోందన్న వార్తలు... మరో వైపు ఎన్నికల్లో ఘన విజయంతో అధికారం చేపట్టిన డీఎంకేకు అన్నాడీఎంకే జుట్టు చేతికి అందివచ్చేపరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత మణికందన్ పై తమిళ హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. పెళ్లి మాటెత్తితే చంపుతానని బెదిరిస్తున్నాడంటూ చాందిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆమె మణికందన్ తో తన సంబంధాలపై వాట్పస్ ఛాటింగ్, వీడియో కాల్స్ వివరాలు, ఫోటోలను మీడియాకు చూపించింది. 
2017లో మణికందన్ తో తనకు పరిచయడం ఏర్పడిందని.. ఆయన మంచిగా రిసీవ్ చేసుకోవడం.. ఆప్యాయంగా మాట్లాడడంతో నేరుగా బంగళాకు వెళ్లి ధైర్యంగా మాట్లాడి వచ్చేదాన్నని గుర్తు చేసుకున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పడడంతో ఇద్దరం కలసి జాయింట్ గా మలేసియాలో బిజినెస్ ప్రారంభిద్దామని ఆలోచించానన్నారు. నేరుగా బంగళాకు వెళ్లి మాట్లాడే సమయంలో తన భార్య తనను సరిగా చూసుకోవడం లేదని.. నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఆయనతో శారీరకంగా దగ్గరయ్యాననన్నారు. ఆయన వెంట పలు అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరయ్యానని తెలిపారు. పెళ్లిమాటెత్తితే చాలు సైలంట్ అయ్యేవాడని.. కొంతకాలం వేచి ఉండు.. పరిస్థితి బాగాలేదని సర్దిచెప్పేవాడని కంటతడిపెట్టుకుంది. అలా అతని మాటలు నమ్మి ఐదేళ్ల పాటు సహజీవనం చేశానని.. మధ్యలో మూడుసార్లు గర్భం వస్తే.. బలవంతంగా తీయించాడని.. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేస్తే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని చాందిని ఆరోపించారు. 


 

Tagged , tamil actress chandini hot comments, heroin chandini complaing, sexual harrassment compalint, ex minister manikandan

Latest Videos

Subscribe Now

More News