OTT Thriller: ఓటీటీలోకి కొత్త క్రైమ్ థ్రిల్లర్.. పోలీస్ vs గ్యాంగ్‌స్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలోకి కొత్త క్రైమ్ థ్రిల్లర్.. పోలీస్ vs గ్యాంగ్‌స్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ క్రైమ్ థ్రిల్లర్ సరెండర్ (Surrender) మూవీ ఓటీటీలో అదరగొడుతుంది. ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ గురువారం (సెప్టెంబర్ 4) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

గౌతమన్ గణపతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎన్నికల సీజన్ నేపథ్యంలో తెరకెక్కింది. పోలీసులు, గ్యాంగ్‌స్టర్, మధ్యలో ఎలక్షన్స్ రచ్చ చుట్టూ తిరిగే సినిమా కథగా వచ్చింది. ఓ గ్యాంగ్‌స్టర్, ఓ పోలీసు బృందం ఒకరికొకరు తలపడతారు.

ALSO READ : Ghaati Box Office: దారుణంగా పడిపోయిన ఘాటి బాక్సాఫీస్ కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంతంటే? భారీ నష్టాలు తప్పవా?

అట్ట్రాక్ట్ చేసే కథకు అనుగుణంగా, డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఐదు రోజుల పాటు వీళ్ల మధ్య సాగే ఫైట్ ఉత్కంఠ రేపేలా ఉండటంతో.. మూవీ ఓటీటీలో దూసుకెళ్తుంది. ఇందులో దర్శన్, లాల్‌, సుజిత్‌, మనీష్‌కాంత్‌, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ మూవీ IMDBలో 8.2 రేటింగ్ దక్కించుకోవడం విశేషం.

కథేంటంటే:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రొటోకాల్ ప్రకారం తన తుపాకీని తిరుమళిసాయి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తాడు. దాన్ని పోలీసు అధికారి పెరియసామి (లాల్) భద్రపరుస్తాడు. కానీ.. అది కనిపించకుండా పోతుంది. దాంతో తుపాకీ వెతికి తీసుకొచ్చే బాధ్యత ట్రైనీ ఎస్‌ఐ పుగళ్‌(దర్శన్) మీద పడుతుంది.

మరోవైపు గ్యాంగ్‌స్టర్ కనగు (సుజిత్) ఓటర్లకు డబ్బు పంచే బాధ్యత తీసుకుంటాడు. కానీ.. అతను పంచాలి అనుకున్న రూ.10 కోట్లు పోగొట్టుకుంటాడు. ఎన్నికలు దగ్గరపడడంతో పెరియసామి, పుగళ్‌ తుపాకీ కోసం వెతుకుతుంటారు. అదే టైంలో కనగు, అతని అనుచరులు పోయిన డబ్బు కోసం వెతుకుతుంటారు. ఈ అన్వేషణలో జరిగే సంఘటనలే మిగతా సినిమా.