దీపావళికి థియేటర్లో రిలీజ్ అయ్యే కోలీవుడ్ మూవీస్..మన తెలుగు సినిమాలెక్కడ?

దీపావళికి థియేటర్లో రిలీజ్ అయ్యే కోలీవుడ్ మూవీస్..మన తెలుగు సినిమాలెక్కడ?

సినిమాలు రిలీజ్ కావాలంటే శుక్రవారం వస్తే చాలనుకునే వారు. అంతేకాకుండా దసరా,సంక్రాంతి, క్రిస్మస్ , దీపావళి వంటి పండుగలు వస్తే చెప్పాల్సిన పనిలేదు. కాసుల వర్షం కురిపించుకోవడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సంవత్సరం ముందు నుంచే ఆలోచిస్తూనే ఉంటారు.

అదేంటో, మన తెలుగు ఆడియన్స్ కి ఇప్పటికీ సరిగా అర్ధం కానీ ప్రశ్నోకటి మిగిలిపోయింది. దసరా, సంక్రాంతి వంటి ఫెస్టివల్స్ కు సినిమాలు పోటీపడి రిలీజైన, దీపావళి కి మాత్రం మన తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా సరిగా రిలీజ్ అవ్వకపోవడమే. గత తేడాది కనీసం మీడియం రేంజ్ మూవీ అయిన ఉండేది. ఈ ఏడాది మన తెలుగు నుంచి ఒక్క సినిమా కుడా..రిలీజే లేకుండా పోయింది.

ఇక దీపావళి రిలీజ్, మూవీస్ చూసుకుంటే..డ‌బ్బింగ్ సినిమాలే ఈ పండ‌క్కి హ‌వా కొనసాగించబోతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన జ‌పాన్ (Japan), రాఘవ లారెన్స్ జిగార్తాండ డ‌బులెక్స్ (Jigarthanda 2) అలాగే బాలీవుడ్ నుంచి డబ్బింగ్ మూవీ అయిన సల్మాన్ భాయ్ టైగ‌ర్-3 (Tiger 3) మూవీస్ రాబోతున్నాయి. మన తెలుగు హీరోస్  అందరూ ఒకేసారి వచ్చి..థియటర్స్ దొరకట్లే అంటూ కొట్టుకుంటారు. కానీ దీపావళి కి మాత్రం థియేటర్స్ అన్నీ కోలీవుడ్ హీరోస్ తో కనిపించబోతున్నాయి. అలా..అని కోలీవుడ్ హీరోస్ మనకి దూరం అని కాదు. కార్తి , లారెన్స్, సల్మాన్ మూవీస్ కి తెలుగులో మంచి ఆడియన్స్ బలం ఉంది.  

కార్తి నటించిన జ‌పాన్‌ మూవీని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద విడుడల చేయ‌బోతున్నారు. ఇంతకు ముందు ఇదే బ్యానర్ లో స‌ర్దార్‌ మూవీను కూడా రిలీజ్ చేశారు. జ‌పాన్ మూవీలో దొంగగా కనిపించబోతున్న కార్తి..నటనను చూడటానికి తెలుగు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. 

లారెన్స్, ఎస్.జె.సూర్య న‌టించిన జిగర్తాండ మూవీని సురేష్ బాబు, ఏషియ‌న్ సునీల్ సంయుక్తంగా రిలీజ్ చేస్తుండ‌టం విశేషం. ఇక సల్మాన్ ఖాన్ టైగ‌ర్-3 విష‌యానికి వ‌స్తే య‌శ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు సినిమాను ఇక్క‌డి వాళ్ల‌కేమీ అమ్మ‌లేదు. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూట‌ర్ల భాగ‌స్వామ్యంతో..తెలుగులో భారీ స్థాయిలోనే రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇక దీపావళి పండుగ డబ్బింగ్ మూవీస్ తో..మన తెలుగు బడా ప్రొడ్యూసర్స్ బ్యానర్లతో రాబోతున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా దీపావళికి రిలీజ్ చేద్దామని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ రీసెంట్ గా పోస్ట్ ఫోన్ చేయడంతో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా థియేటర్లోకి రాకుండా పోయింది. మరి నెక్స్ట్ ఇయర్ అయిన తెలుగు మూవీస్ వస్తాయో చూడాలి మరి.