తమిళనాడులో కెనరా బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఐదుగురికి జైలు శిక్ష విధించింది కోయంబత్తూరు జిల్లా కోర్టు. నామక్కల్ లోని కెనరాబ్యాంక్ మాజీ మేనేజర్ తో సహా ఐదుగురు కలిసి బ్యాంక్ కు నష్టం కలిగించినందుకు లక్షా 25 వేల జరిమానాతో మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఎల్ కుమారేశన్ అనే వ్యక్తి మేనేజర్ గా ఉన్నప్పుడు M/s అన్బు రోడ్ లైన్స్ యొక్క మేనేజింగ్ పార్టనర్ మరియు M/s అన్బు రోడ్‌వేస్ (I) ప్రైవేట్ లిమిటెడ్ MD తో కుమ్మక్కయి నామక్కల్‌కు బ్యాంకుకు భారీ నష్టం కలిగించారని సీబీఐ కేసు నమోదు చేసింది.
కార్తికేయ గ్రూప్ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలకు అతిక్రమిస్తూ అప్పటి మేనేజర్ కుమారేశన్ లోన్ మంజేరు చేశాడు. బ్రాంచ్ మేనేజన్ మంజూరు చేసిన రుణాలను మేనేజింగ్ పార్టనర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని సీబీఐ ఆరోపించింది. అంతే కాకుండా బ్రాంచ్ మేనేజర్ గ్రూప్ ఖాతాల్లో చెక్ ను డ్రా చేసుకొనేందుకు అనుమతించారు. నిందితులపై జూలై 16న కోయంబత్తూరులోని డిజిగ్నేటెడ్ కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మేనేజర్ తన పరిమితికి మించి లోన్ మంజూరు చేశారని సీబీఐ చార్జ్ షీట్ లో పేర్కొంది.ఈ కేసును విచారించిన కోర్టు వీరి వలన బ్యాంకుకు 13.23 కోట్ల రూపాయిలు నష్టం వచ్చిందని సీబీఐ వాదనతో ట్రయల్ కోర్టు ఏకీభవించి వారిని దోషులుగా నిర్దారించింది . తీర్పు వెలువడే సమయానికి ఒక నిందితుడ మరణించగా.. మరొక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.