జైలర్ మూవీ చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్

జైలర్  మూవీ చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. రిలీజైన మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. 

లేటెస్ట్ గా  జైలర్ మూవీని తమిళనాడు సీఎం  స్టాలిన్(Tamilnadu CM Stalin) చూసి,  జైలర్ టీంను ప్రశంసించినట్టు డైరెక్టర్ తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. .ఈ సందర్భంగా నెల్సన్ దిలీప్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..సినిమాను వీక్షించిన స్టాలిన్ సార్ కు ధన్యవాదాలు..  సీఎం స్టాలిన్ తనతో మాట్లాడిన మాటలు ఏంతో ప్రేరణ కలిగేలా, ఇంకా ముందుకు వెళ్లేలా చేశాయని నెల్సన్ తెలిపారు. దీంతో జైలర్ టీం ఫుల్ హ్యాపీ మూమెంట్ లో ఉన్నట్టు సమాచారం.  

జైలర్ ఆగస్టు 10న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ అయినా మూడు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. 

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్(Anirudh Ravichander) అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.ఈ మూవీలో తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, సునీల్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.