తమిళనాడులో సడలింపులతో ఈనెల 28 వరకు లాక్ డౌన్

తమిళనాడులో సడలింపులతో ఈనెల 28 వరకు లాక్ డౌన్

చెన్నై: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో తమిళనాడులో సడలింపులతో లాక్ డౌన్ ఈనెల 28 వరకు పొడిగించింది. దేశమంతా అన్ లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. రేపటితో లాక్ డౌన్ ముగుస్తున్న నేపధ్యంలో కేసులు తగ్గుముఖం పడుతున్నందున సడలింపులతో మరో వారం రోజులు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని దుకాణాలు, మాల్స్ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంచుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, సిటీ బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడుపుకునేందుకు అనుమతిచ్చారు. అలాగే ఆటోలు, క్యాబ్ లు ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అనుమతి లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చని, అయితే కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని షరతు విధించారు.