
కరోనా వైరస్ కేసులు అధికంగా పెరుగుతుండడంతో తమిళనాడులో డిసెంబర్ 31 వరకు లాక్‌డౌన్‌ను పొడగించారు. ఇందులో కొన్ని ఆంక్షలను సడలించారు. బీచ్‌లను పబ్లిక్‌కు ఓపెన్ చేశారు. యూజీ, పీజీ కాలేజీలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ట్రైనింగ్ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 14 నుంచి మెరీనా బీచ్‌ను విజిట్ చేసేందుకు అనుమతి కల్పించారు. ప్రస్తుతం చెన్నైలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్స్ సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనాను కంట్రోల్ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.