
ఆన్ లైన్ గేమింగ్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా యువత ఆన్ లైన్ గేమింగ్ కి ఎడిక్ట్ అయ్యింది. గేమ్ ఆడేందుకు డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ గేమ్ లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆన్ లైన్ గేమ్ లను బ్యాన్ చేసింది. గేమ్ లను బ్యాన్ చేసిన తరువాత వాటిని ఆడేందుకు ప్రయత్నించినా, బెట్టింగ్ లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
కొద్దిరోజుల క్రితం కోయంబత్తూర్ లో ఆన్ లైన్ గేమింగ్ కారణంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పలువురు ఆన్ గేమింగ్ లో మోసపోవడంతో ఆర్ధికంగా నష్టపోతున్నారు. దీంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాష్ట్రంలో ఆన్ లైన్ గేమ్ లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తే రూ.5వేలు ఫైన్, 6నెలలు జైలు శిక్ష, అదే ఆన్ లైన్ గేమ్ లను ఆడేలా ప్రేరేపిస్తూ గేమింగ్ జోన్లను ఏర్పాటు చేస్తే రూ.10వేల ఫైన్ 2ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.