సైకిల్ పై మంత్రి చక్కర్లు..ఊరంతా పరేషాన్

సైకిల్ పై మంత్రి చక్కర్లు..ఊరంతా పరేషాన్

తమిళనాడు హెల్త్ మినిస్టర్ విజయ్ భాస్కర్ తన సొంతూరు సైకిల్ పై చక్కర్లు కొట్టారు.విరాలిమలై ఇలుప్పూరులో ఇవాళ ఉదయం  టీ షర్టు పంచెతో సైకిల్ తో  ఊరంతా తిరిగాడు. మంత్రిని సైకిల్ పై చూడటంత స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.  సైకిల్ పైన తిరుగుతూ ఊర్లో ఉన్న వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. కాలుకి గాయంతో ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తిని పలకరించి అతనికి ఉచితంగా వైద్యం అందించే వెసులుబాటు కల్పించారు.  విజయ్ భాస్కర్ తన ఊరికి వెళ్లినప్పుడల్లా ఇలా రెండు మూడు కిలో మీటర్లు సైకిల్ పై తిరగడం అలవాటు. ఇలా సాధారణ వ్యక్తిగా మంత్రి సైకిల్ సవారీ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.