తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు

 తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023  జూలై 23 ఆదివారం  సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వృద్ధాప్య పెన్షన్ ను రూ. 1000 నుంచి  రూ. 1200 లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. అలాగే..  వికలాంగులకు రూ.1,000 నుంచి రూ.1,500కి పెంచారు.  పెంచిన పెన్షన్లు వచ్చే నెల అంటే ఆగస్టు నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నట్లుగా వెల్లడించింది. 

దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్ల వలన లబ్ధి చేకూరుతుందని,  రాష్ట్ర ఖజానాకు రూ. 845.91 కోట్ల అదనపు వ్యయం అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.   ఇక గృహిణులకు ప్రతి నెలా రూ. 1000  అందించే కార్యక్రమానికి త్వరలో తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.