పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు

పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు

ఆయన సిట్టింగ్ ఎంపీ.. పేరు గణేష్ మూర్తి.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. డీఎంకే పార్టీ నుంచే టికెట్ ఆశించారు.. పార్టీ టికెట్ ఇవ్వలేదు.. దీంతో మనస్తాపం చెందిన 77 ఏళ్ల గణేష్ మూర్తి.. పార్టీని బెదిరిద్దామని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.. తాగింది కొంచెమే అయినా.. వెంటనే వాంతులు అయ్యాయి.. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మార్చి 24వ తేదీన కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ గణేష్ మూర్తి కోలుకుంటున్న సమయంలో.. సడెన్ గా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో ఉన్న వైద్యులు వెంటనే చికిత్స అందించినా లాభం లేకపోయింది. కార్డియాక్ అరెస్ట్ తో.. మార్చి 28వ తేదీ తెల్లవారుజామున చనిపోయారు. 

77 ఏళ్ల వయస్సులో ఎంపీ టికెట్ కోసం.. పార్టీని బెదిరించాలనే ప్రయత్నంలో.. ఏకంగా తుది శ్వాస విడవటం అందర్నీ ఆశ్చర్యానికి, షాక్ కు గురి చేసింది. అంత పెద్ద మనిషి.. అంత పెద్ద రాజకీయ జీవితం ఉన్నా.. రాజకీయాలపై ఆయనకు ఉన్న విపరీతమైన మక్కువ ప్రాణాలు పోయేలా చేసింది. 

ALSO READ :- Akshay Kumar: వాటి వల్ల నా స్టైల్ మారదు.. అక్షయ్ కామెంట్స్కి ఫ్యాన్స్ ఫిదా

మళ్లీ ఎంపీ కావాలనే తన లక్ష్యం నెరవేరకపోగా.. ఏకంగా చావును కొనితెచ్చుకున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.