సుజీత్ క్షేమంగా రావాలంటూ మోడీ ప్రార్థన

సుజీత్ క్షేమంగా రావాలంటూ మోడీ ప్రార్థన

తమిళనాడు తిరుచ్చి జిల్లాలో బోర్ బావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా  బయటకు రావాలని  ప్రార్థించారు ప్రధాని నరేంద్ర మోడీ.  బాలుడి పరిస్థితిపై తమిళనాడు సీఎం పళని స్వామితో మాట్లాడానని మోడీ అన్నారు. సహాయక చర్యలపై ఆరాదీశానని మోడీ ట్విట్టర్లో తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పళని స్వామి బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు చెప్పారు. బాలుడికి నిరంతరం ఆక్సీజన్ అందిస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల క్రితం ఆడుకుంటూ ఇంటి దగ్గర్లోని బోర్ బావిలో పడిపోయిన చిన్నారి సుజీత్  బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.