త‌మిళ‌నాడులో 40 వేలు దాటిన క‌రోనా కేసులు

త‌మిళ‌నాడులో 40 వేలు దాటిన క‌రోనా కేసులు

త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ భారీగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల న‌మోదులో కొత్త పీక్ రికార్డ్ అవుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1982 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన కేసుల్లో ఇదే అత్య‌ధికం. ఇవాళ న‌మోదైన మొత్తం కేసుల్లో 1933 మంది లోక‌ల్స్, 49 మంది విదేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వెన‌క్కి వ‌చ్చిన వారు ఉన్నార‌ని త‌మిళ‌నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18 మంది మ‌ర‌ణించ‌గా.. 1342 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని పేర్కొంది. దీంతో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య‌ 40,698కి చేరిందని చెప్పింది. ఆస్ప‌త్రుల్లో చికిత్స త‌ర్వాత 22,047 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. కరోనాతో 367 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోగ్య శాఖ చెప్పింది. ప్ర‌స్తుతం 18,284 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చెన్నై సిటీలోనే 28,924 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది.