
తమిళ హీరో కార్తీ(Karthi) ఇటీవలే జపాన్(Japan) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగన్(Rajumurugan) దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కార్తీ కెరీర్ లో మరో ప్లాప్ మూవీగా మిగిలిపోయింది జపాన్ మూవీ. ఇక జపాన్ రిజల్ట్ వచ్చేయడంతో.. తన తరువాతి సినిమాను కూడా మొదలెట్టేశాడు కార్తీ.
తమిళ సూపర్ హిట్ మూవీ 96 కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీ అన్న స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఏనుగు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. ఇందుకోసం కేరళ నుండి ఒక ఏనుగును తెప్పించారట. ఆ ఏనుగుని కంట్రోల్ చేయడం కోసం పది మందిని ఏర్పాటు చేశారట. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి 96 సినిమాతో ఆడియన్స్ హృదయాలను తాకిన దర్శకుడు ప్రేమ్ కుమార్ కార్తీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.