మరికొద్ది గంటల్లో పోలింగ్.. 428 కోట్లు సీజ్ 

V6 Velugu Posted on Apr 05, 2021

చెన్నై: పోలింగ్ కు కొన్ని గంటల ముందు తమిళనాడులో భారీగా నగదు పట్టుపడింది. రేపు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు డబ్బులు, ఖరీదైన వస్తువులు, బహుమతుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో కేంద్ర బలగాలతో తనిఖీలు చేయగా.. ఏకంగా 428 కోట్ల నగదు పట్టుపబడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు  మరి కొద్ది గంటల సమయమే ఉంది. ఇలాంటి సమయంలో ఇంత భారీ స్థాయిలో నగదు, నగలు పట్టుపడడం సంచలనం సృష్టిస్తోంది. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన 428 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల ప్రచారం ముగియకముందే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు సమాచారం. పోలీసులు ఇప్పటి వరకు  స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 225.5 కోట్లు నగదు కాగా, బంగారం, నగలు సహా విలువైన లోహ ఆభరణాల విలువ రూ.176.11 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

Tagged assembly elections 2021, tamilnadu

Latest Videos

Subscribe Now

More News