తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

తమిళనాడులో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో జూలై 12 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. అయితే లాక్‌డౌన్ పొడిగించిన స్టాలిన్... కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. రెస్టారెంట్లకు 50 శాతం పరిమితితో అనుమతిచ్చారు. హాస్టల్స్, లాడ్జెస్, గెస్ట్ హౌస్‌లకు కూడా పర్మిషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాలను మూడు కేటగిరిలుగా విభజించారు. ఫస్ట్ కేటగిరిలో 11 హాట్ స్పాట్ జిల్లాలు, రెండో కేటగిరీలో తక్కువ యాక్టివ్ కేసులున్న 23 జిల్లాలు, ఇక థర్డ్ కేటగిరిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. గతంలో సెకండ్, థర్డ్ కేటగిరిల్లో ఉన్న జిల్లాలకు ప్రస్తుతం సడలింపు లభించింది. అయితే సినిమా హాల్స్, బార్స్, స్విమ్మింగ్ పూల్స్, స్కూల్స్, కాలేజేస్, జూలు మాత్రం మూసే ఉండనున్నాయి.