కాంగ్రెస్​తో పొత్తుకు చర్చలు జరుగుతున్నయ్: తమ్మినేని

కాంగ్రెస్​తో పొత్తుకు చర్చలు జరుగుతున్నయ్: తమ్మినేని
  • కాంగ్రెస్​తో పొత్తుకు చర్చలు జరుగుతున్నయ్
  • బీఆర్ఎస్ ​ఓడిపోవడం ఖాయం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

సూర్యాపేట, వెలుగు: ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, సీట్ల విషయమై క్లారిటీ వచ్చాక పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మంగళవారం సూర్యాపేటలోని విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీ‌‌ఆర్ఎస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేది కమ్యూనిస్టులేనని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

 గత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలిచ్చి మోసం చేసిందని, పాత హామీలకే  గతి లేదు కానీ, కొత్త హామీలు ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. బండారు రమేశ్, సీపీఎం సీనియర్ లీడర్​నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి పాల్గొన్నారు.