
- రక్షణ రంగంలో చేరనున్న ‘ఏహెచ్ 64ఈ’ హెలిక్యాప్టర్లు
- ఈ నెల 21న అమెరికా నుంచి రానున్న హెలిక్యాప్టర్లు
- భారత్, పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్న ఆర్మీ
న్యూఢిల్లీ: వచ్చే వారం మన రక్షణ రంగంలో ‘అపాచీ ఏహెచ్ 64ఈ’ హెలిక్యాప్టర్లు చేరనున్నాయి. తొలివిడతలో భాగంగా మూడింటిని ఈ నెల 21న అమెరికా పంపనుంది. వీటిని భారత్, పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్నట్లు మన ఆర్మీ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు ‘అపాచీ ఏహెచ్ 64ఈ’ హెలిక్యాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 2020లో అమెరికాతో (ట్రంప్ మొదటి టర్మ్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు) మన దేశం ఒప్పందం చేసుకుంది.
ఈ డీల్ విలువ 600 మిలియన్ డాలర్లు. ఈ హెలిక్యాప్టర్లు నిరుడు జూన్ వరకే ఇండియాకు చేరుకోవాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు మూడింటిని పంపనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మూడు హెలిక్యాప్టర్లు ఘాజియాబాద్ సమీపంలోని హిండన్ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగనున్నాయి. అనంతరం రక్షణ రంగంలో వినియోగం కోసం వీటిని బార్డర్కు తరలిస్తారు. ఈ హెలిక్యాప్టర్లలో అత్యాధునిక కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్ ఉంటాయి.
రాత్రి పూటైనా సరే టార్గెట్లను ఖచ్చితంగా గుర్తించి దాడి చేయగల డిఫెన్స్ సిస్టమ్ఇందులో ప్రత్యేకత. ఒప్పందంలో భాగంగా మరో మూడు అపాచీ హెలిక్యాప్టర్లు ఈ ఏడాది చివరి నాటికి అమెరికా పంపే అవకాశం ఉంది.