మహిళా కూలీలే టార్గెట్..19మర్డర్లు చేసిన దంపతుల అరెస్టు

V6 Velugu Posted on Jul 29, 2021

ఒంటి మీద బంగారం కోసం మర్డర్లు చేసే సైకో కిల్లర్ జంటను దుండిగల్ పరిసరాల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి  చెందిన స్వామి, అతని భార్యను అదుపులోకి  తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పలు హత్యలు చేసినట్టు సైకో కిల్లర్లు ఒప్పుకున్నారు. భర్త 8 హత్యలు.. భార్య  11 మర్డర్లు చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించారు. ఓ మిస్సింగ్  కేసు దర్యాప్తుతో కూపీ లాగితే.. సైకో కిల్లర్ల వ్యవహారం బయటపడింది.

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మిస్సింగ్ కేసును నమోదు చేశామని బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి తెలిపారు. వాళ్ళ బందువులతో విచారణ చేసి.. అక్కడ దొరికిన ఒక క్లూతో కేసు ను ఛేదించామన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు తెలిపారు డీసీపీ పద్మజా రెడ్డి. కురుబా స్వామి, నరసమ్మ ఇద్దరు 9 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని..ఈ ఇద్దర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేశామన్నారు. ఈనెల లోనే 4 నేరాలు చేశారు.. అందులో 3 రాబరీ కేసులు, 1 హత్య కేసులో నిందితులగా ఉన్నారన్నారు.

లేబర్ అడ్డా లో పని కోసం వేచి చూస్తున్న ఓ మహిళను చూసి ఆమెను ఎలాగైనా తీసుకెళ్లాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారని.. అందులో భాగంగా ఓ గుట్ట దగ్గర దేవాలయానికి  సున్నం వేయాలి అని చెప్పి 700 రూపాయలు కు మాట్లాడుకొని బైక్ పై తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతమైన  అగ్గిరాళ్ల గుట్ట దగ్గరకు తీస్కెళ్లి.. అక్కడ మధ్యాహ్నం భోజనం చేశారని.. ఆ తర్వాత తన భర్త కోరిక తీర్చాలని నరసమ్మ కోరినట్లు చెప్పారు. భాదితురాలు ఒప్పుకోక పోవడం తో స్వామి ఆమెపై బలవంతంగా రేప్ చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో నరసమ్మ కూడా భర్తకు సహకరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్ పై కట్టెతో కొట్టి చంపేసి..ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ని తీసుకుని వెళ్లి పోయినట్లు తెలిపారు. లేబర్ అడ్డపై ఉన్న మహిళలను టార్గెట్ గా చేసుకుని స్వామి అత్యాచారాలకు పాల్పడినట్లు డీసీపీ పద్మజా రెడ్డి తెలిపారు. లేబర్ అడ్డపై ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Tagged Female labourers Target, 19 murders, couple arrest, DCP, Padmaja Reddy

Latest Videos

Subscribe Now

More News