కోరుట్ల నుంచి ముంబయికి ప్రతిరోజూ రైలు నడుపుతం

కోరుట్ల నుంచి ముంబయికి ప్రతిరోజూ రైలు నడుపుతం

మరో 450 రోజుల్లో కేసీఆర్ సర్కారు కూలడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి  తరుణ్ చుగ్ అన్నారు.  ప్రజలంతా బై బై కేసీఆర్ అంటున్నారని.. డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కల కేవలం బీజేపీతోనే సాకారం అవుతుందనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారని తెలిపారు. అహంకార పూరిత, నిరంకుశ, కుటుంబవాద, అవినీతిమయ కేసీఆర్ సర్కారు నుంచి తెలంగాణ విముక్తి కోరుకుంటోందన్నారు . జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో తరుణ్ చుగ్ ప్రసంగించారు.  

‘‘కేసీఆర్ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు.. కానీ కొడుకు, కూతురు, అల్లుడు అందరికీ మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. ఈ కుటుంబవాద ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సమాయత్తం అవుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ముంబయి నుంచి ప్రతి రోజు  కోరుట్లకు  రైలు నడుపుతామని హామీ ఇచ్చారు. గల్ఫ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తరుణ్ చుగ్ తెలిపారు.