యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు :టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కుమార్

యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు :టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కుమార్

 

  • టాస్క్​ ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ కుమార్, ఏవో శైలజ​
  • మల్లంపల్లి, రాంచంద్రాపూర్​ లో ఫర్టిలైజర్​ షాపుల తనిఖీ

ములుగు, వెలుగు: యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనల మేరకు పురుగుమందులు, ఎరువులు విక్రయించాలని టాస్క్ ఫోర్స్​ఇన్​స్పెక్టర్​ బండారికుమార్​యాదవ్, మల్లంపల్లి మండల వ్యవసాయ అధికారిణి శైలజ అన్నారు.  ఆదివారం ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్​గ్రామంలో గల సృజన, ఫర్టిలైజర్స్, మల్లంపల్లిలోని మన గ్రోమోర్​సెంటర్ ఫర్టిలైజర్​ షాపుల్లో టాస్క్​ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా యూరియా అమ్మకాలపై తనిఖీలు చేపట్టారు. 

 షాపుల వారీగా స్టాక్​ రికార్డులు, రైతులకు అమ్మిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. రైతులకు సక్రమంగా అవసరమైన మేరకే అమ్మకాలు చేపట్టాలని సూచించారు.  ఒక్కో  రైతు సుమారుగా 30 నుంచి 40 వరకు బస్తాలను కొనుగోలు చేయడంతో వారిని పిలిపించి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. యూరియాను అక్రమంగా నిల్వచేసినా, పక్కదారి పట్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు కానిస్టేబుల్ నాగరాజు, రైతులు భూక్య యాకూబ్, రాజేశ్, రమణారెడ్డి, సక్రు, చంద్రమౌళి పాల్గొన్నారు.