వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఆర్ఐలకు ఫీల్డ్ ఎంక్వయిరీల టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఆర్ఐలకు ఫీల్డ్ ఎంక్వయిరీల టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రెవెన్యూ శాఖలో స్టాఫ్ లేక వేలాది ఫైళ్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • చేతి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద సిబ్బంది లేక తహసీల్దార్ల ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: వీఆర్వో వ్యవస్థ రద్దు, వీఆర్ఏల సమ్మెతో రెవెన్యూ శాఖలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. తగినంత స్టాఫ్ లేక వేలాది అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్​లకు అప్లై చేసుకుంటే పెళ్లి కూతురు వయసు, క్యాస్ట్​తో పాటు ఇతర అర్హతలపై రెవెన్యూ ఇన్ స్పెక్టర్లే (ఆర్ఐ) వెరిఫికేషన్ చేయాలి. వాళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే లబ్ధిదారులకు డబ్బులు మంజూరవుతాయి. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం క్యాస్ట్, ఇన్ కం, రెసిడెన్సీ, ఈడబ్ల్యూఎస్ లాంటి సర్టిఫికెట్ల కోసం ఎవరైనా ‘మీ సేవ’లో అప్లై చేస్తే సర్టిఫికెట్ జారీకి కూడా ఆర్ఐలే ఫీల్డ్ లెవల్​లో వెరిఫికేషన్ చేస్తారు. గతంలో ఊరికో వీఆర్వో ఉండడం వల్ల వాళ్లే  ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇచ్చేవారు. వాళ్ల రిపోర్టును గిర్దావర్లు పరిశీలించి తహసీల్దార్లకు పంపితే సర్టిఫికెట్లు జారీ అయ్యేవి. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత వాళ్లు  లేకపోయినా వీఆర్ఏలు ఫీల్డ్ ఎంక్వయిరీ చేసేవారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారు కూడా రెండున్నర నెలలుగా సమ్మెలో ఉండడంతో భూ వివాదాలు, మ్యుటేషన్లు, క్యాస్ట్, ఇన్ కం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పనులన్నింటికీ ఫీల్డ్ రిపోర్టులను ఆర్ఐలే ఇవ్వాల్సి వస్తోంది. ఆర్ఐలు మండలానికి ఒకరిద్దరే ఉండడంతో వేలల్లో వస్తున్న అప్లికేషన్లను సకాలంలో వెరిఫై చేయలేకపోతున్నారు. రిపోర్టులు ఇచ్చేందుకు కలెక్టర్లు, తహసీల్దార్లు టార్గెట్లు పెడుతుండడంతో గంటల తరబడి డ్యూటీలు చేస్తూ పని ఒత్తిడికి లోనవుతున్నామని ఆర్ఐలు వాపోతున్నారు. 

ధరణి అర్జీలన్నీ ఆర్ఐల వద్దకే..

ధరణి పోర్టల్ ద్వారా వివిధ రకాల గ్రీవెన్స్ ఆప్షన్స్  ఇచ్చాక రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అప్లికేషన్లు వస్తున్నాయి. నిషేధిత జాబితాలో నుంచి భూముల తొలగింపు, పాస్​ బుక్స్​లో తప్పుల సవరణ, సర్వే నంబర్ మిస్సింగ్స్, పెండింగ్ మ్యుటేషన్స్ తదితర సమస్యలపై వచ్చిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్లన్నీ నేరుగా కలెక్టర్ల లాగిన్​లోకి వెళ్లినా వాళ్లు ఈ అర్జీలపై రిపోర్టును తహసీల్దార్ల నుంచే తెప్పించుకుంటున్నారు. దీంతో చాలా మంది తహసీల్దార్లు ఎప్పటిలాగే ఆర్ఐలను ఫీల్డ్ కు పంపి ఎంక్వైరీ తర్వాత రిపోర్టు తీసుకొని కలెక్టర్లకు పంపిస్తున్నారు. ధరణిలో ఇలాంటి అప్లికేషన్లు ఒక్కో మండలం నుంచి వందల్లో వస్తున్నాయి. కానీ మండలానికి ఒకరిద్దరు ఆర్ఐలే ఉండడంతో సకాలంలో రిపోర్టులు ఇవ్వలేకపోతున్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయడంతోపాటు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు అనుగుణంగా ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాఫ్​ను నియమిస్తేనే రెవెన్యూ పాలన గాడిన పడుతుందని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్​రెడ్డి, కె.గౌతమ్ కుమార్ పేర్కొన్నారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌