తొమ్మిది వారాలు ఉన్నాడు.. ఎంత సంపాదించాడో తెలుసా?

తొమ్మిది వారాలు ఉన్నాడు.. ఎంత సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ గా మారాడు టేస్టీ తేజ(tasty teja). తన కామెడీ టైమింగ్, సరదా పంచులతో కంటెస్టెంట్స్ తోపాటు ఆడియన్స్ ను కూడా తెగ ఎంటర్టైన్ చేశాడు. అందుకే తొమ్మిదివారాలుగా అతను ఎన్నిసార్లు నామినేషన్స్ లోకి వచ్చినా ఆడియన్స్ సేవ్ చేశారు. కానీ తొమ్మిదవ వారం అనూహ్యంగా ఇంటినుండి బయటకు వచ్చాడు తేజ. 

నిజానికి తేజ ఎలిమినేషన్ ను ఎవరు ఊహించలేదు. తనకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ ఈ వారం వారు నామినేషన్స్ లో లేకపోవడంతో తేజ ఎలిమినేట్ అవ్వాల్సివచ్చింది. తేజ ఎలిమినేషన్ సమయంలో హోస్ట్ నాగార్జున కూడా నిన్ను మిస్ అవుతాను తేజ అన్నారు అంటే తేజ ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థమవుతుంది. 

అయితే.. తేజ ఎలిమినేట్ అయినా సందర్బంగా అతని రెమ్యునరేషన్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిమ్మిదివారాల పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన తేజ వారానికి రూ.1.75 లక్షల చొప్పున మొత్తంగా రూ.15 ల;లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకున్నాడు. తేజ ఇప్పటివరకు చేసిన షోస్, వీడియో తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.