సైబర్ దాడులకు చెక్.. టాటా ఏఐజీ నుంచి సైబర్ ఎడ్జ్ పాలసీ

సైబర్ దాడులకు చెక్.. టాటా ఏఐజీ నుంచి సైబర్ ఎడ్జ్ పాలసీ

హైదరాబాద్, వెలుగు: టాటా ఏఐజీ జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కంపెనీలు, స్టార్టప్‌‌లు, ఎంఎస్​ఎంఈలను సైబర్​ దాడుల నుంచి రక్షించడానికి 'సైబర్‌‌ ఎడ్జ్'​ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది.  రాబోయే మూడు సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో తమ సైబర్​ ఇన్సూరెన్స్​ వ్యాపారాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఏపీ, తెలంగాణ సైబర్​ దాడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే టాప్​–2లో ఉన్నాయి. 

2024లో ఈ రెండు రాష్ట్రాల్లో 62 లక్షలకుపైగా మాల్‌‌వేర్​ దాడులు, 17,500 ర్యాన్సమ్‌‌వేర్​ దాడులు జరిగాయి. డేటా బ్రీచ్​ సగటు నష్టం రూ. 19.5 కోట్లు  ఉంది. ఫార్మా, ఐటీ, బీఎఫ్​ఎస్​ఐ, తయారీ రంగాల కంపెనీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్‌‌ ఎడ్జ్​ ద్వారా నష్టాలను భర్తీ చేయడమే కాకుండా, సంస్థలు సైబర్​ రిజైలెన్స్​ను పెంచుకోవడానికి సహాయపడతామని టాటా ఏఐజీ సీనియర్ ​ఎగ్జిక్యూటివ్​  నజ్మ్​ బిల్‌‌గ్రామీ అన్నారు. 

 ప్లాన్​ ఫోరెన్సిక్​ దర్యాప్తులు, డేటా రికవరీ, చట్టపరమైన మద్దతు సహా ఇతర నష్టాలను కవర్​ చేస్తుందని తెలిపారు.