
న్యూఢిల్లీ: మోడర్నా వ్యాక్సిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్స్ ప్రయత్నిస్తోంది. మోడర్నా ఇన్‌క్లూజివ్‌తో టాటా గ్రూప్స్ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. దేశంలో మోడర్నా వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ఇండియా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌తో టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ కలసి పని చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ విషయంపై మోడర్నా సంస్థ, టాటా గ్రూప్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. కానీ మోడర్నాను సాధారణ ఫ్రిడ్జ్ టెంపరేచర్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు. అమెరికాలో డిసెంబర్‌లో ఈ వ్యాక్సిన్‌కు అప్రూవల్ రాగా.. యూరప్‌లో ఈ నెలలో అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర లభించింది. నవంబర్‌లో మోడర్నా విడుదల చేసిన డేటా ప్రకారం ఈ టీకా 94.1 శాతం సేఫ్ అని తేలింది.