
మల్టీ పర్పజ్ హెవీడ్యూటీ ట్రక్‌లు అల్ట్రా టీ.9, అల్ట్రా టీ.14 లను సౌత్ ఆఫ్రికాలో టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ టాటా ఆఫ్రికా హోల్డింగ్స్ లిమిటెడ్‌తో కలిసి ఈ బండ్లను మార్కెట్‌లోకి తెచ్చింది.
అల్ట్రా టీ.9 లో 3.3 లీటర్ల ఇంజిన్, అల్ట్రా టీ.14 లో 5 లీటర్ల ఇంజిన్ అమర్చారు. హెవీ లోడ్లను ఎక్కువ దూరం ఇవి మోయగలవని కంపెనీ చెబుతోంది.