
ఇప్పటికే నెక్సాన్ ఈవీతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, తన రెండో ఎలక్ట్రిక్ వెహికల్ టైగర్ ఈవీని బుధవారం లాంచ్ చేసింది. జిప్‌ట్రాన్ టెక్నాలజీతో టైగర్ ఈవీని తెస్తున్నారు. ఇందులో 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ మోడల్ కోసం కొన్ని డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21 వేలు కట్టి వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 31 నుంచి వెహికల్స్ డెలివరీ స్టార్ట్ చేస్తారు. టైగర్ ఈవీ ధర రూ. 10.58 లక్షల నుంచి ఉంది.