విస్ట్రన్​ ఫ్యాక్టరీని దక్కించుకోనున్న టాటా

విస్ట్రన్​ ఫ్యాక్టరీని దక్కించుకోనున్న టాటా
  • ఐఫోన్లు తయారు చేసే ఛాన్స్​

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతోంది. యాపిల్​ ఫోన్లను తయారు చేసే కర్ణాటకలోని విస్ట్రన్​ ఫ్యాక్టరీని కొనేందుకు ఇది వచ్చే నెలలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ల అసెంబ్లింగ్​లోకి టాటాలు రావడం ఇదే మొదటిసారి. దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని విస్ట్రన్ ఫ్యాక్టరీని టేకోవర్ చేయడానికి 600 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,900 కోట్లు)కుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత 12 నెలలుగా ఫ్యాక్టరీ కొనుగోలు గురించి ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలో పది వేల మందికిపైగా  కార్మికులు పనిచేస్తున్నారు.   ఐఫోన్​ 14 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇక్కడే తయారు చేస్తున్నారు.​ కనీసం 1.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 14,800 కోట్లు) విలువైన ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విస్ట్రన్ 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫ్యాక్టరీ నుండి తయారు చేయాలని భావిస్తోంది. ఈ టార్గెట్​ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్​ దక్కుతాయి. 

వచ్చే ఏడాది నాటికి ప్లాంట్ కార్మికశక్తిని మూడు రెట్లు పెంచాలని కూడా భావిస్తోంది.  ఒప్పందం గురించి మాట్లాడటానికి టాటా, విస్ట్రన్,  యాపిల్ అధికార ప్రతినిధులు ఒప్పుకోలేదు.  ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో విస్ట్రన్​ భారతదేశం నుండి దాదాపు 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,100 కోట్లు) ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎగుమతి చేసింది. యాపిల్​ఇతర కాంట్రాక్ట్​ మానుఫ్యాక్చరర్స్​ ఫ్యాక్స్​కాన్​, పెగాట్రాన్స్​లు కూడా యాపిల్​ ప్రొడక్టులను తయారు చేస్తున్నాయి.  కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్లు,  వాషింగ్టన్–  బీజింగ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా నుండి వైదొలిగే ప్రయత్నాలను యాపిల్ వేగవంతం చేసింది. అంతేగాక ఎలక్ట్రానిక్స్​ తయారీకి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇన్సెంటివ్స్​ ప్రకటించాయి.   టాటా గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా  ఎలక్ట్రానిక్స్, ఈ–-కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పటికే ఐఫోన్ ఛాసిస్​లను తయారు చేస్తోంది.