టాటా మోటార్స్ 17 రకాల ట్రక్కులను విడుదల చేసింది. వీటికి 6.7 లీటర్ల కమ్మిన్స్ ఇంజన్లను అమర్చారు. ఇంధన పొదుపు కోసం ఇందులో ఫ్యూయల్ ఎకానమీ స్విచ్ టెక్నాలజీ ఉంటుంది.
డ్రైవర్ల రక్షణ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, కొలిజన్ మిటిగేషన్ సిస్టమ్ ఉంటాయి. పెద్ద క్యాబిన్, డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. ఈ ట్రక్కులు గ్రీన్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ధరలను ప్రకటించలేదు.
టయోటా కరెంటు కారు.. ఎబెలా
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూయిజర్ ఎబెలాను విడుదల చేసింది. ఇది 49 కిలోవాట్ అవర్, 61 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల రెండు బ్యాటరీలతో వస్తుంది.
పెద్ద బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. భద్రత కోసం లెవల్–2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా ఉంటాయి. ఎబెలాలో 10 అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ధరలను కంపెనీ ప్రకటించలేదు.
