దివాలా ఊసెత్తకండి..జెట్ లెండర్ల కోరిక

దివాలా ఊసెత్తకండి..జెట్ లెండర్ల కోరిక

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌ వేస్ అమ్మకం కోసం ప్రస్తుతం జరుగుతున్న బిడ్డింగ్‌ ప్రక్రియ విఫలమైతే దివాలా చట్టానికి (ఇన్‌ సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌ ట్రప్సీట్) వెలుపల సొల్యూషన్​ కావాలని ఎస్‌‌బీఐ నేతృత్వంలోని లెండర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం జెట్‌ కు రూ.8,500కోట్ల అప్పులు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో సంస్థను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటిం చారు. లెండర్లు తక్షణ సాయంగా రూ.1,500 కోట్లు ఇస్తామన్నా, ఆ నిధులు రాకపోవడంతో మూసివేత అని వార్యమైంది. జెట్‌ కు అత్యధికంగా అప్పులు ఇచ్చిన ఎస్‌‌బీఐ.. లెండర్ల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తోంది. జెట్‌ లో వాటా అమ్మకానికి ఇది ప్రారంభించిన బిడ్డింగ్‌ ప్రక్రియ వచ్చే నెల ముగుస్తుంది. బిడ్డింగ్‌ విజయవంతంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్న లెండర్లు, ఒకవేళ విఫలమైతే ప్లాన్‌ బీని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే ఐబీసీ కేసులు లేకుండా సమస్యను పరిష్కరిం చుకోవాలని భావిస్తున్నారు. ఐబీసీ ప్రకారం అయితే ఆస్తుల అమ్మకానికి నేషనల్‌ కంపెనీలా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) అంగీకారం అవసరం. సమస్య పరిష్కారం మార్కెట్‌ పరిస్థితుల ప్రకారం, కాలానుగుణంగా జరుగుతుంది. ఎన్సీఎల్టీకి వెళ్లకుంటే విమానాలు, ఇతర ఆస్తుల నుంచి లెండర్లుఎక్కు వ ప్రయోజనం పొందవచ్చు.

నిధుల సమీకరణకు ప్రయత్నాలు

జెట్‌ ఎయిర్‌ వేస్‌‌లో వాటా కొనుగోలుకు ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌‌, టీపీజీ క్యాపిటల్‌ , ఇండిగో పార్ట్‌‌నర్స్‌‌,నేషనల్‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ (ఎన్‌ ఐఐ-ఎఫ్‌ ) బిడ్లు వేసినట్టు తెలిసింది. బిడ్డర్ల పూర్తి వివరాలు వచ్చే నెల 10 నాటికి తెలుస్తాయి. బిడ్డింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 16 విమానాల ద్వారా నిధులు సమీకరిం చడానికి లెండర్లు ప్రయత్నిస్తున్నారు. జెట్‌ సంక్షోభంలో చిక్కుకు న్నప్పటి నుంచే పరిష్కారం కోసం లెండర్లు కృషి చేసినా, జెట్‌యాజమాన్యం , ప్రమోటర్‌ ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం పరిస్థితి చేయి దాటిపోయిం దని విశ్వసనీయవర్గా లు తెలిపా యి.

జెట్‌ విమానాలు ఎయిర్‌ ఇండియా చేతికి ?

జెట్‌ నుంచి బోయింగ్‌ 737 విమానాలను లీజు పద్ధతిలో తీసుకోవాలనే ప్రతిపాదనను ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ పరిశీలిస్తోంది. లెస్సర్లకు జెట్‌ లీజు బకాయిలు చెల్లించకపోవడంతో గత నెల రెం డో వారంలో 69 విమానాల సేవలు నిలిచి పోయాయి. సంస్థను తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించడంతో మిగతా విమానాలూ మూలనపడ్డాయి. జెట్‌ కు చెందిన ఐదు బోయింగ్‌ 777 విమానాలను లీజుకు తీసుకోవడానికి ఎయిర్‌ ఇండియాఇది వరకే చర్చలు జరుపుతోంది. ఎయిర్‌ ఇండియాఎక్స్‌‌ప్రెస్‌‌ కేరళ నుంచి గల్ఫ్‌ , కొన్ని ఆగ్నేయ ఆసియాదేశాలకు సేవలు అందిస్తోంది. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలకూ విమానాలు నడుపుతోంది.

ప్రైవేటీకరణ పరిష్కారం కాదు :

ఎయిర్‌ ఇండియా యూనియన్‌ ముంబై :

ప్రైవేటైజేషన్‌ ఒక్కటే పరిష్కారం కాదనడానికి, జెట్‌ ఎయిర్వేస్‌‌, కింగ్‌ ఫిషర్‌ ల మూసివేత ఉదాహరణలుగా నిలుస్తాయని ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.కాబట్టి, ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించే అంశంలోప్రభుత్వం మరోసారి ఆలోచిం చాలని సూచిం చారు.ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు చురుగ్గా చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డునపడ్డ 20 వేల మందిజెట్‌ ఉద్యోగులకు మద్దతుగా నిలబడతామన్నారు ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల సంఘ నాయకుడు . పెద్ద ఎయిర్‌ లైన్స్‌‌ మూతపడుతున్న నేపథ్యంలో విధానాలను సమీక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు. ఏవియేషన్‌ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్‌ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యం లో సమీక్ష ఆవశ్యకమని చెప్పారు. ఇండియాలో గత అయిదేళ్లలోనే ఐదు ఆరుఎయిర్‌ లైన్స్‌‌ మూతపడ్డాయి. మొదట కింగ్‌ ఫిషర్‌ ,ఇప్పుడు జెట్‌ ఎయిర్వేస్‌‌ ఆపరేషన్స్‌‌ను నిలిపేశాయి.ప్రైవేటీకరణ మాత్రమే లాభదాయకతను, సామర్ధ్యాన్నితీసుకు వస్తుందని చెప్పే వారందరూ, కింగ్‌ ఫిషర్‌ , జెట్‌ సంక్షోభాలను లోతుగా చూడాలని ఎయిర్‌ ఇండియాకార్పొరే షన్ ఎంప్లాయీస్‌‌ యూనియన్‌ (ఏసీఈయూ)నాయకుడు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే నిజమైతే,ఈ రెండు ఎయిర్‌ లైన్స్‌‌ మూతపడి ఉండకూడదన్నారు. 2040 నాటికి సాధించాలని పెట్టుకున్న టార్గెట్స్‌‌ ఆధారంగా తీసుకున్న ప్రభుత్వ విధానాలే ఇప్పుడు ఏవియేషన్ రంగంలో సంక్షోభానికి కారణమని విమర్శించారు. 2040 నాటికి ఇండియాలో పాసింజర్‌ ట్రాఫిక్‌ 110 కోట్లకు చేరుతుందని అంచనా. జెట్‌ ఎయిర్వేస్‌‌ మూసివేత నేపథ్యంలో ఆ ఎయిర్‌ లైన్స్‌‌లో టికెట్లు కొనుక్కు న్న పాసెంజర్లను మెరుగైన ఆఫర్లతో ఆదుకుంటు-న్నది ఎయిర్‌ ఇండియానేనని ఏసీఈయూ నాయకుడుగుర్తు చేశారు. ప్రైవేట్‌ ఎయిర్‌ లైన్స్‌‌ నుంచి ఇలాం టిచర్యలను ప్రభుత్వం ఆశిం చలేదని పేర్కొన్నారు.ఓపెన్‌ స్కై విధానానికి బ్రేకులు వేయాల్సి న టైం వచ్చిందని కూడా అభిప్రాయపడ్డారు.