ఈ ఎఫ్​డీలతో ఎక్కువ వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్

ఈ ఎఫ్​డీలతో ఎక్కువ వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్

బిజినెస్​ డెస్క్​, వెలుగు: ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు ఎక్కువ మందికి నచ్చే అసెట్​క్లాస్​. ఈక్విటీలు,  ఇతర పెట్టుబడులతో పోల్చితే, ఎఫ్​డీలు సురక్షితమే కాక  హామీపూర్వక రాబడిని అందిస్తాయి. సాధారణ ఎఫ్​డీల కంటే ట్యాక్స్​ సేవింగ్​ ఎఫ్​డీ స్కీములతో పెట్టుబడిదారులు అదనపు లాభాలు పొందవచ్చు. ట్యాక్స్​ సేవింగ్​ ఎఫ్​డీలతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ట్యాక్స్​ సేవింగ్​ ఎఫ్​డీలలో పెట్టుబడితో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ ఎఫ్​డీలకు కనీసం 5 సంవత్సరాల లాక్- ఇన్ పీరియడ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  దానిపై వచ్చే వడ్డీకి ఇన్వెస్టర్​ పన్ను బ్రాకెట్ ప్రకారం పన్ను వేస్తారు. పెట్టుబడి ఉమ్మడిగా చేసినట్లయితే, ఎఫ్​డీ రసీదులోని మొదటి హోల్డర్ మాత్రమే పన్ను ప్రయోజనాలకు అర్హుడు అవుతాడు. ట్యాక్స్​ సేవింగ్​ ఎఫ్​డీలపై క్యూములేటివ్​ (సంచిత),  నాన్-క్యుములేటివ్ వడ్డీ చెల్లింపులను ఎంచుకోవడానికి అవకాశం ఉంది.  ఆదాయపు పన్ను చట్టాల  ప్రకారం, వ్యక్తులు,  హిందూ అవిభక్త కుటుంబాలు మాత్రమే ట్యాక్స్​ సేవింగ్​ ఎఫ్​డీలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇట్లాంటి పెట్టుబడులపై అత్యధిక రాబడి రేటును అందించే కొన్ని బ్యాంకుల స్కీముల వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇండస్ఇండ్ బ్యాంక్

ఇండస్​ఇండ్​ బ్యాంక్ 5 సంవత్సరాల ట్యాక్స్​ సేవింగ్​ఇన్వెస్ట్​మెంట్లపై 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే, సీనియర్ సిటిజన్లు ఈ పథకంపై అదనంగా 0.5 శాతం రాబడిని పొందుతారు.

ఆర్​బీఎల్​ బ్యాంక్

2 నుండి 3 సంవత్సరాల ఎఫ్​డీల కోసం  ఈ బ్యాంక్ అత్యధికంగా 6.5 శాతం రాబడిని అందిస్తుంది.  పన్ను ఆదా పథకాలపై వడ్డీ 6.3 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు  ఎఫ్​డీలపై  6.8 శాతం వడ్డీ పొందుతారు.

ఐడీఎఫ్​సీ

రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై ఐడిఎఫ్‌‌‌‌‌‌‌‌సి ఫస్ట్ బ్యాంక్ ట్యాక్స్ సేవర్ స్కీము కింద వడ్డీ రేటు 6.25 శాతం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.5 శాతం వడ్డీకి అర్హులు.

డీసీబీ బ్యాంక్

డీసీబీ బ్యాంక్ తన పన్ను ఆదా ఎఫ్​డీలపై 5.95 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఎఫ్​డీపై సంపాదించిన వడ్డీని మూడు నెలలకు ఒకసారి పొందవచ్చు. 

కరూర్​ వైశ్యా బ్యాంక్

రూ.రెండు కోట్లలోపు విలువైన కరూర్​ వైశ్యా బ్యాంక్  పన్ను షీల్డ్ ఎఫ్​డీ స్కీము డిపాజిట్లపై 5.9 శాతం వడ్డీ ఇస్తారు. మీ దగ్గర అదనంగా డబ్బు ఉంటే ఈ బ్యాంకు ఎఫ్​డీల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు.