డాక్టర్లకు రూ.1000 కోట్ల ఉచితాలు పంపిణీ చేసిన మైక్రోల్యాబ్స్ !

డాక్టర్లకు రూ.1000 కోట్ల ఉచితాలు పంపిణీ చేసిన మైక్రోల్యాబ్స్ !

జ్వరానికి, తదితర నొప్పుల నివారణకు విరివిగా వాడే డోలో 650 మాత్రల తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్ పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తీవ్ర ఆరోపణలు చేసింది. అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. రూ.1000 కోట్ల విలువైన ఉచితాలను పంపిణీ చేసి, దానికి బదులుగా తమ ఔషధాలకు ప్రచారం చేయించుకున్నారని పేర్కొంది. జులై 6న 9 రాష్ట్రాల్లో ఆ కంపెనీకి చెందిన 36 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెక్కల్లో చూపని రూ.1.2కోట్ల నగదుతో పాటు, రూ.1.4 కోట్ల వజ్రాభరణాలు కూడా జప్తు చేసినట్టు సీబీడీటీ తెలిపింది. తెలిపిన వివరాల ప్రకారం ఉచితాల కింద ప్రయాణ ఛార్జీలు, ఇతర బహుమతులు కూడా డాక్టర్లకు ఇచ్చినట్టు సమాచారం. వీటన్నంటి విలువ సుమారు రూ.1000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. మరో విషయమేమిటంటే సీబీడీటీ పేర్కొన్న ప్రకటనలో గ్రూప్ పేరు లేకపోయినా, విశ్వసనీయ వర్గాలు మాత్రం ఆ కంపెనీ మైక్రోల్యాబ్స్ గానే స్పష్టం చేశాయి.