జులై 31లోపు ట్యాక్స్ రిటర్స్న్ ఫైల్ చేయాలి

జులై 31లోపు ట్యాక్స్ రిటర్స్న్ ఫైల్ చేయాలి

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: 
ఆర్థిక సంవత్సరం 2021–22 కి గాను  ట్యాక్స్ రిటర్న్స్‌‌లను ఈ నెల 31 లోపు  ఫైల్ చేయాల్సి ఉంటుంది.  ఈ డెడ్‌‌లైన్‌‌ను పొడిగిస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ, అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు  ట్యాక్స్‌‌ రిటర్న్‌‌లను వీలున్నంత తొందరగా ఫైల్ చేయడం బెటర్ అని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. 

ఐటీఆర్ ఫైల్ చేయాల్సినప్పుడు ఫాలో కావాల్సినవి..

1) ఫామ్‌‌ 16 లేదా 16 ఏ ని ముందు తీసుకోవాలి..
శాలరీ ద్వారా ఇన్‌‌కమ్‌‌ పొందే ట్యాక్స్‌‌పేయర్లు గ్రాస్‌‌ శాలరీ డిటెయిల్స్‌‌ను తెలిపే ఫామ్‌‌ 16, 16 ఏ ని ఎంప్లాయర్‌‌‌‌ (ఉద్యోగం చేస్తున్న కంపెనీ) నుంచి తీసుకోవాలి. తనకొచ్చే శాలరీలో బేసిక్ శాలరీ, హెచ్‌‌ఆర్‌‌‌‌ఏ, ఎల్‌‌టీఏ వంటివి ఎంత ఉన్నాయో తెలియజేసేందుకు ఈ ఫామ్‌‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  కొన్ని సార్లు ఫామ్‌‌ 16 లో బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ మాత్రమే ఉంటాయి. మిగిలిన డిటెయిల్స్‌‌ క్లియర్‌‌‌‌గా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాస్ శాలరీ నుంచి హెచ్‌‌ఆర్‌‌‌‌ఏ వంటి ట్యాక్స్ మినహాయింపులను తీసేసి  శాలరీ ఇన్‌‌కమ్‌‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ శాలరీ కూడా ఫామ్‌‌ 16 లేదా 16 ఏ లో పేర్కొన్న శాలరీ ఇన్‌‌కమ్‌‌కి సమానంగా ఉండాలి. ఎంప్లాయర్‌‌‌‌ ఇచ్చే ఫామ్‌‌ 16 లేదా 16 ఏలో ఇన్‌‌కమ్‌‌, మినహాయింపులు, డిడక్షన్లూ ఉంటే రిటర్న్‌‌లను ఫైల్ చేయడం మరింత సులువుగా ఉంటుంది.

2) టీడీఎస్‌‌, టీసీఎస్ డిటెయిల్స్‌‌ చెక్ చేసుకోవాలి..
కట్‌‌ చేసుకున్న  ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ ఎట్ సోర్స్‌‌ (టీడీఎస్‌‌), ట్యాక్స్ కలెక్టెడ్‌‌ ఎట్ సోర్స్‌‌ (టీసీఎస్‌‌) వివరాలు కరెక్ట్‌‌గా ఉన్నాయో లేదో  ముందు చెక్ చేసుకోవాలి. ఇన్‌‌కమ్‌‌ట్యాక్స్ వెబ్‌‌సైట్‌‌లో లేదా నెట్‌‌బ్యాంకింగ్‌‌ అకౌంట్‌‌ ద్వారా టీడీఎస్‌‌, టీసీఎస్‌‌ డిడక్షన్స్‌‌ కరెక్ట్‌‌గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇన్‌‌కమ్‌‌ ట్యాక్ వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లి మీ అకౌంట్‌‌లోకి లాగిన్ అయితే  ఫామ్‌‌ 26ఏఎస్‌‌ను పొందొచ్చు. ఈ ఫామ్‌‌లో  టీడీఎస్ డిటెయిల్స్ ఉంటాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీపైన,  బాండ్స్‌‌, డివిడెండ్ల ఇన్‌‌కమ్‌‌పైన వేసే టీడీఎస్ లేదా టీసీఎస్‌‌ డిటెయిల్స్‌‌ కూడా ఇందులో ఉంటాయి. టీడీఎస్‌‌ లేదా టీసీఎస్‌‌ డిటెయిల్స్ సరిగ్గా లేకపోతే ట్యాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌(ట్యాక్స్‌‌ డిడక్టర్‌‌‌‌) ను సంప్రదించొచ్చు. 

3) ఇన్‌‌కమ్‌‌ డిటెయిల్స్ సరిపోయాయా? లేదా?
టీడీఎస్‌‌, టీసీఎస్ డిటెయిల్స్‌‌ను చెక్‌‌ చేసుకున్న తర్వాత యాన్యువల్ ఇన్‌‌ఫర్మేషన్ స్టేట్‌‌మెంట్‌‌ (ఏఐఎస్‌‌) లోని డిటెయిల్స్‌‌ కరెక్ట్‌‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో ఇండివిడ్యువల్‌‌కు వివిధ సోర్స్‌‌ల నుంచి వచ్చిన ఆదాయ వివరాలు ఏఐఎస్‌‌లో ఉంటాయి. శాలరీ, ప్రొఫెషన్‌‌, రెంట్‌‌, వడ్డీ ఇలా వివిధ సోర్స్‌‌ల నుంచి వచ్చిన ఆదాయం డిటెయిల్స్‌‌ ఇందులో ఉంటాయి. ఇండివిడ్యువల్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఖర్చుచేశారు అనే వివరాలు కూడా ఉంటాయి. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌‌లు, స్టాక్ బ్రోకర్లు వంటి  ఫైనాన్షియల్ సంస్థలు మీ వివరాలను ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌కు పంపుతాయి.  ఏఐఎస్‌‌ను కిందటేడాది లాంచ్ చేశారు కాబట్టి కొన్ని డిటెయిల్స్ తప్పుగా ఉన్నా లేదా మిస్ అయినా ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. ఏఐఎస్‌‌లో కొన్ని వివరాలు మిస్ అయినా ట్యాక్స్‌‌పేయర్లు తమ ఇన్‌‌కమ్‌‌ వివరాలను ఫైలింగ్‌‌లో కరెక్ట్‌‌గా పేర్కొవాలి.

4) క్యాపిటల్ గెయిన్ స్టేట్‌‌మెంట్లను పొందాలి..
షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌‌ చేసిన ఇన్వెస్టర్లు ఏడాదిలో రూ. లక్ష కంటే ఎక్కువ లాభం పొందితే లాంగ్‌‌ టెర్మ్‌‌ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 10 శాతం, షార్ట్‌‌ టెర్మ్‌‌ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌‌ కింద 15 శాతం కట్టాల్సి ఉంటుంది. గోల్డ్‌‌, రియల్‌‌ ఎస్టేట్ వంటి ఆస్తులపై వచ్చే లాభాలను (ఇన్‌‌ఫ్లేషన్‌‌ను లెక్కించాక) ఇన్‌‌కమ్‌‌కు యాడ్ చేసి ట్యాక్స్ వేస్తారు. అదే లాంగ్‌‌టెర్మ్ అయితే 20 శాతం ట్యాక్స్ వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌‌లలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ ఫండ్ హౌస్‌‌ను లేదా కంప్యూటర్ ఏజ్  మేనేజ్‌‌మెంట్ సర్వీసెస్ కంపెనీ వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లి  క్యాపిటల్ గెయిన్ స్టేట్‌‌మెంట్‌‌ను పొందొచ్చు. షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వారు తమ బ్రోకర్ల నుంచి  ఈ స్టేట్‌‌మెంట్‌‌ను పొందొచ్చు. నష్టాలు వచ్చినా ఈ స్టేట్‌‌మెంట్‌‌లను ఐటీఆర్‌‌‌‌లో సబ్మిట్ చేయడం ముఖ్యమని, ఎనిమిది ఫైనాన్షియల్ ఇయర్ల వరకు ఈ లాస్‌‌లను ఇతర అసెట్ల ద్వారా వచ్చిన లాభాల నుంచి కట్‌‌ చేసుకోవడానికి వీలుంటుందని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. 

5) ఏఐఎస్‌‌లో అన్ని రకాల ఆదాయాల డిటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఐటీఆర్‌‌‌‌ను ఫైల్ చేసేటప్పుడు డిపాజిట్లపై వచ్చే ఇన్‌‌కమ్‌‌ను, బ్యాంక్‌‌ బ్యాలెన్స్‌‌ను పేర్కొనాలి. క్రిప్టోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని  కూడా పేర్కొనాలి. విదేశాల్లోని ఆస్తుల వివరాలను ఐటీఆర్‌‌‌‌లో పేర్కొనడం తప్పనిసరి. 

6) చివరిగా ఫైనల్ ఐటీఆర్‌‌‌‌ ఫామ్‌‌ను సబ్మిట్ చేసే ముందు  ట్యాక్స్ డిడక్షన్లను, మినహాయింపులను మరోసారి చెక్ చేసుకోవాలి. 

వెరిఫై చేసుకోవడం మరవొద్దు..
ఐటీఆర్‌‌‌‌ను సబ్మిట్ చేసినంత మాత్రాన పని పూర్తయినట్టు కాదు. ఫైల్ చేసిన ఐటీఆర్‌‌ను 120 రోజుల్లో వెరిఫై  చేసుకొవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఐటీఆర్ ఇన్‌‌వాలిడ్ అవుతుంది.ఐటీఆర్‌‌‌‌ ఫైల్ చేయనందుకు పెనాల్టీ పడుతుంది. ఆధార్ బేస్డ్ ఓటీపీ, నెట్‌‌ బ్యాంకింగ్‌‌, బ్యాంక్ అకౌంట్‌‌ ద్వారా, డీమాట్ అకౌంట్‌‌ ద్వారా, ఐటీఆర్‌‌‌‌ 5 ని సైన్ చేసి పంపడం ద్వారా ఫైల్ చేసిన ఐటీఆర్‌‌‌‌ను వెరిఫై చేసుకోవచ్చు. 

ఎవరెవెరు ఐటీఆర్‌‌‌‌లు ఫైల్ చేయాలంటే..
ఈ కింద పేర్కొన్న వారు ట్యాక్స్‌‌ రిటర్న్‌‌లను కచ్చితంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.

1. గ్రాస్ శాలరీ ఆదాయం (డిడక్షన్లు, మినహాయింపులకు ముందు) బేసిక్‌‌ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ రూ. 2.5 లక్షలను దాటితే ఐటీఆర్‌‌‌‌లను ఫైల్ చేయాలి. పాత ట్యాక్స్ సిస్టమ్‌‌ కింద  సీనియర్ సిటిజన్ల గ్రాస్ శాలరీ ఆదాయం రూ. 3 లక్షలు దాటితే, సీనియర్ సీనియర్ సిటిజన్ల శాలరీ రూ. 5 లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
2. మీ బిజినెస్ మొత్తం సేల్స్, టర్నోవర్ లేదా గ్రాస్ రిసీట్‌‌ల వాల్యూ రూ. 60 లక్షలు దాటినప్పుడు.
3. ఏదైనా ఫ్రొఫెషన్ (డాక్టర్‌‌‌‌, లాయర్ వంటివి) నుంచి మీ గ్రాస్ రిసీట్స్ వాల్యూ రూ. 10 లక్షలు దాటినప్పుడు.
4. విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలు కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు.
5. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌‌లోని డిపాజిట్లు రూ. 50 లక్షలు దాటిన లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్‌‌లో డిపాజిట్లు రూ. కోటి దాటినా ఐటీఆర్ ఫైల్ చేయాలి.
6. మీ ఎలక్ట్రిసిటీ బిల్లు రూ. లక్ష కంటే ఎక్కువ వచ్చినా.
7. ఫారిన్‌‌లో ఆస్తులు ఉన్నా లేదా ఆదాయం వస్తున్నా.
8. మీ టీడీఎస్ లేదా టీసీఎస్‌‌ రూ. 25 వేలు  (సీనియర్ సిటిజన్లయితే రూ.50 వేలు) లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా. 
9. టీడీఎస్‌‌ లేదా టీసీఎస్‌‌ కోసం చేసిన చెల్లింపులను రిఫండ్ చేసుకోవాలన్నా ఐటీఆర్‌‌‌‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.