టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : జీతాలు భారీగా పెంచిన కంపెనీ

టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : జీతాలు భారీగా పెంచిన కంపెనీ

 ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశపు అతిపెద్ద IT సర్వీసెస్ కంపెనీ అయిన TCS ఎంప్లాయిస్ కు వార్షిక జీతాల పెంపును ప్రకటించింది. పనితీరు ఆధారంగా 4.5 నుంచి 7 శాతం సాలరీ హైక్ ఇచ్చింది. మంచి ఫర్మామెన్స్ కనబర్చిన ఉద్యోగులకు రెండంకెల పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. మార్చి 31, 2024 నాటికి కంపెనీలో 6,01,546 మంది ఉద్యోగులు ఉన్నారు. TCS ఈ సంవత్సరం సుమారు 40,000 మంది ఫ్రెషర్‌లను జాయిన్ చేసుకోవాలని ఆలోచిస్తుంది.