TCSలో రిక్రూట్ మెంట్ స్కాం : 16 మంది ఉద్యోగులపై వేటు

TCSలో రిక్రూట్ మెంట్ స్కాం : 16 మంది ఉద్యోగులపై వేటు

ఉద్యోగుల నియామక స్కామ్ లో 16 మంది ఉద్యోగులను తొలగించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ. వీరితోపాటు అక్రమంగా ఉద్యోగం పొందిన ఆరుగురిని నిషేధించింది. ఉద్యోగ నియామకాల్లో లంచాల కుంభకోణం జరిగిందని జూన్ 23న చేపట్టిన విచారణ చేపట్టింది.. రీసోర్స్ మేనేజ్ మెంట్ ఫంక్షన్ లో ఉద్యోగాల నియామకాలకోసం లంచాల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించిన టీసీఎస్.. కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు 19 ఉద్యోగులపై వేటు వేసింది. మొత్తం ఆరుగురు వెండర్స్, అనుబంధ సంస్థలు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించింది. 

కంపెనీ రీసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగుల నియమకాల్లో లంచాలు తీసుకున్నారని టీసీఎస్ చీఫ్ ఎగ్జి్క్యూటివ్ ఆఫీసర్ ఆరోపించారు.  ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన వారు 100 కోట్ల దాకా  కమిషన్లు తీసుకొని ఉండొచ్చని చెబుతున్నారు.  జూన్ 29న టీసీఎస్ నియామక స్కామ్ తో సంబంధం ఉన్న ఆరుగురు ఉద్యోగులు, ఆరుగురు బిజినెస్ అసోసియేట్స్ ను నిషేధించారు.