ఏపీలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగు దేశం(టీడీపీ) పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
మరోవైపు, ఈ ఎన్నికల్లో పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్(వైసీపీ) పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతంరెడ్డిని ఎంపిక చేసింది.
Also Read :- పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
కాగా, వచ్చే ఏడాది మార్చి 29 నాటికి కృష్ణా-గుంటూరు, ఈస్ట్ - వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పదవులు పూర్తవుతాయి. దాంతో, ఎన్నికల సంఘం ఆ స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.