రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు : చంద్రబాబు

రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు : చంద్రబాబు

తనను ఒకటి రెండు రోజుల్లో  అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారంనాడు ( Seotember 6) అనంతపురంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.  తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. 

 డూ ఆర్ డై అంటూ ముంచుకు వస్తున్న 2024 ఎన్నికల్లో నెగ్గడం కోసం బాబు గతానికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే తన జీవితం మొత్తం ధారపోస్తూ ఈ రాజకీయంలో ఒడ్డుతున్నారు.     మరి బాబు ఒడ్డెక్కుతారా లేదా అన్నది జనాల చేతులలో ఉంది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని ఆయన అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు కొంతమంది నేతలు.
చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేయడం  నేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లనే ఆయన తరచూ ఏదో విధంగా బయటపడిపోతున్నారు అని.... అయితే ఇపుడు బాబు సైతం అరెస్ట్ అంటున్నారు. ఆయన నోట ఫస్ట్ టైం అరెస్ట్ మాట వస్తోంది. దానికి డేట్ టైం కూడా ఆయనే చెప్పేశారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకూ ప్రజలకు ఒక హింట్ అయితే ఇచ్చారు. బాబుని ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఒకవేళ చేస్తే ఏ కేసులలో అరెస్ట్ చేస్తారు అన్నది మాత్రం ఆయన చెప్పడంలేదు. బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన ఐటీ విభాగానికి అరెస్ట్ చేసే అధికారం లేదు, అయితే ఈడీకి సర్వాధికారాలు ఉన్నాయి.

ఏపీ సీఐడీ ఐటీ నోటీసులు అందుకున్న వారితో కలిపి అందరికీ నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయంలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ సీఐడీ విభాగం విచారణ జరుపుతోంది. ఇపుడు ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంతో పాటు  ఆయన పీఏ శ్రీనివాస్, అలాగే ఎంపీవీ కి కూడా నోటీసులు ఇచ్చిన క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా వీరి పాత్ర ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.