రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదల

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదల

ఏపీ టీడీపీ లీడర్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభితో పాటుగా మరో 11 మంది నేతలకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం  శుక్రవారం సాయంత్రం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 25 వేల రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతి గురువారం న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి సత్యానంద్‌ షరతులు విధించారు. జైలు నుంచి రిలీజైన పట్టాభికి టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

గన్నవరం ఘటనలో పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ గన్నవరం పోలీసులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చారు.