వై నాట్​ పులివెందుల.. జగన్​ కు కౌంటరిచ్చిన చంద్రబాబు

వై నాట్​ పులివెందుల.. జగన్​ కు కౌంటరిచ్చిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికల హీట్ మొదలైండి. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు..ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఈకార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విరుచుకుపడ్డారు. వై నాట్ 175 అన్న జగన్ మాటకు కౌంటర్ ఇస్తూ వై నాట్ పులివెందుల అన్నీ చోట్ల టీడీపీ, జనసేన కూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. సీఎం జగన్​ ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికే 65 సీట్లు మార్చారని, అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టారని, మిగతా వారిని అక్కడికి ఇక్కడికి మార్చారని.. ఈ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారం అవుతుందా.. చెత్త చెత్తే కదా అని ఎద్దేవా చేశారుచంద్రబాబు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు డెడ్ లైన్ మొదలైందని..ప్రజాక్షేత్రంలో జగన్ కు శిక్షపడే సమయం దగ్గర పడిందని మండిపడ్డారు.  టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో అన్నమయ్య జిల్లా పీలేరులో భారీ బహిరంగసభ నిర్వహించారు.   జనం రక్తం పీల్చే జలగలు మనకు ఎందుకంటూ విమర్శించారు. .

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రతినిధులని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. రాయలసీమ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నానని.. ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాల మీద అభిమానంతో ఓట్లు వేస్తే మన కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. రాయలసీమలో అన్ని కులాల వారు ఉన్నారని, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా చెప్పాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశించిన అభివృద్ది, సంక్షేమం టీడీపీ వల్లనే సాధ్యం అవుతుందని సూచించారు.